Manchu Lakshmi In Srikakulam: స్మార్ట్ తరగతి గదులను ప్రారంభించిన మంచు లక్ష్మి
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కొరసవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సినీ తార మంచు లక్ష్మి స్మార్ట్ క్లాస్ రూమ్ ను ప్రారంభించారు. టీచ్ ఫర్ చేంజ్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మంచు లక్ష్మి..... జిల్లాలో 20 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేశారు. నిర్దేశించిన ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేకంగా తరగతి గదులను కేటాయించి స్మార్ట్ క్లాసులను నిర్వహిస్తారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు మెరుగైన విద్యను పొందేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు మంచు లక్ష్మి తెలిపారు.