Madhuri Duvvada Srinivas Emotional | ఆసుపత్రి బెడ్ పై నుంచే మాధురి ఎమోషనల్ కామెంట్స్ | ABP Desam

Continues below advertisement

Madhuri Duvvada Srinivas Emotional | విన్నారు కదా...! తను కోట్ల రూపాయలు చూసింది. జిల్లాలో మంచి పేరు సంపాదించింది. వందల మంది బలగాన్ని చూసింది. కానీ, చివరకు దువ్వాడ శ్రీనివాస్ ఉదంతం వల్ల ఈ దుస్థితికి చేరుకోవాల్సి వచ్చింది అన్నట్లుగా మాధురి కన్నీళ్లు పెట్టుకున్నారు. మనుషుల్లో మానవత్వం ఉందనుకుంటే..చివరకు మోసమే ఉందని ఎమోషనల్ అయ్యారు. దువ్వాడ శ్రీనివాస్, మాధురిల బంధం గురించి వార్తలు ఎక్కువగా రావడంతో మనస్తాపం చెందిన ఆమె.. రోడ్డుపై ఆగి ఉన్న కారును గుద్దేశారట. ఆ ప్రమాదంలో గాయపడిన మాధురి ప్రస్తుతం విశాఖపట్నంలో అపొలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ బెడ్ పై నుంచే ఇలా వీడియో విడుదల చేశారు. దీంతో.. రోడ్డు ప్రమాదంలో మాధురికి గాయాలు ఐనప్పటికీ..దువ్వాడ శ్రీనివాస్ ఆసుపత్రికి వచ్చి చూడలేదు. మే బీ ఆయనను ఉద్దేశించే ఈ వీడియో విడుదల చేసి ఉంటారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటన ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో అన్న ఉత్కంఠ తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram