రాజమండ్రిలో చిరుత, ఎక్కడెక్కడ తిరుగుతోందో కెమెరాల్లో రికార్డ్

Continues below advertisement

నాలుగు రోజులుగా రాజమండ్రిలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. రాజమండ్రి శివారు దివాన్‌చెరువు ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు ట్రాప్ కెమెరాల్లో రికార్డవటంతో ఆ ప్రాంతంలో అలజడి రేగుతోంది. ఒంటరిగా రాత్రిళ్లు సంచరిచ్చొద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న వేళ..అసలు చిరుత కదలికలు ఏయే ప్రాంతాల్లో ఉన్నాయి. అధికారులు తీసుకుంటున్న చర్యలేంటీ ఈ వీడియోలో. ఇప్పటికే దివాన్ చెరువు వద్ద చిరుత పాదముద్రలు గుర్తించారు అటవీ అధికారులు. పరిసర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ పగ్‌ మార్క్స్‌ని బట్టి అది చిరుత పులేనని DFO కన్‌ఫమ్ చేశారు. సాయంత్రం 6 గంటలు దాటిన తరవాత ఎవరూ బయటకు రావద్దని, బయట కూర్చోవద్దని సూచించారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాల్సి వచ్చినా తప్పకుండా టార్చ్‌లైట్ తీసుకెళ్లాలని చెప్పారు. పిల్లల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ క్రమంలోనే స్థానికులతో ABP దేశం ప్రత్యేకంగా మాట్లాడింది. అధికారులు ఏం చర్యలు తీసుకుంటున్నారో అడిగి తెలుసుకుంది. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram