Lanka Villages Suffering With Godavari Floods | భారీ వరదలకు నీట మునిగిన లంక గ్రామాలు | ABP Desam
Lanka Villages Suffering With Godavari Floods | భద్రాచలం వద్ద వరద ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. 14.60 లక్షల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి వదులుతండడంతో దిగువన ఉన్న అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలో దాదాపు 54 లంక ఆవాస ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. ఈ పరిస్థితిపై ఏబీపీ దేశం గ్రౌండ్ రిపోర్ట్..
భద్రాచలం వద్ద వరద ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం భధ్రాచలం వద్ద 44.20 అడుగుల స్థాయి నీటి ప్రవాహం కొనసాగుతుండగా... ధవళేశ్వరం వద్ద 14.40 అడుగుల స్థాయి నీటి మట్టం కొనసాగుతోంది. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 14.60 లక్షల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి వదులుతండడంతో దిగువన ఉన్న అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలో దాదాపు 54 లంక ఆవాస ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. మోకాల్లోతు వరద ముంపునీటిలో లంక ప్రజలు జీవనం గడుపుతున్నారు. ఇప్పటికే వరద సాయం కింద ప్రభుత్వం ద్వారా 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు అధికారులు అందించారు.