Tension In Nandyal: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అరెస్ట్
నంద్యాలలోని బొమ్మల సత్రం బొగ్గు లైన్లో ఉద్రిక్తత తలెత్తింది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను అధికారులు తొలగిస్తుండగా.... స్థానికులు అడ్డుకున్నారు. అధికారులతో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి వాగ్వాదానికి దిగారు. బాధితులకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ నాయకులకు జనసేన శ్రేణులు మద్దతు తెలిపాయి.