కర్నూలు జిల్లాలో కూలిన బడి స్లాబ్,తప్పిన ప్రమాదం..! | ABP Desam
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం సొగనూరు గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల పై కప్పు నుండి పెచ్చులు ఉడి పడుతుండటంతో తమ పిల్లలను బడులకు పంపలేము అంటూ తల్లిదండ్రులు పాఠశాలకు తాళం వేసి నిరసన తెలిపారు.పాఠశాలలో 235 మంది విద్యార్థులు 9 మంది ఉపాధ్యాయులు.బడిలో ఉన్న అన్ని గదులు శిథిలావస్థకు చేరాయి ఏ క్షణం ఏమి జరుగుతుందో అని రోజు బయపడుతూనే ఉన్నారు.ఇలా ఉంటే ప్రాణాలు పణంగా పెట్టి తమ పిల్లలను బడులకు పమపలేమని,కావాలంటే తమ పిల్లలకు గుడిలోన,చెట్ల కింద చదువులు నేర్పాలంటున్నారు తల్లిదండ్రులు.