Konaseema Boat Races: చేపల వేట హద్దుల కోసం ప్రతి ఏడాది దీపావళి తర్వాత పోటీలు
Continues below advertisement
కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం బలుసుతిప్పలో చేపల వేట హద్దుల కోసం గోదావరిలో మత్స్యకారులు బోట్లతో పోటీ పడ్డారు. ఉదయం 7 గంటలకు పోటీలు మొదలయ్యాయి. పల్లంకుర్రు, ఎదుర్లంక, దరియాలతిప్ప, యానాం నుంచి కోటిపల్లి వరకు ఉన్న ప్రాంతాలలో అధిక సంఖ్యలో చేపలు పడే ప్రాంతాలను బోట్లతో పోటీపడి దక్కించుకుంటారు. ముందుగా ఎవరైతే ఆ ప్రాంతానికి బోట్లలో చేరుకుంటారో...... గోదావరికి వరదలు వచ్చేదాకా ఆ ప్రాంతం వారి అధీనంలో ఉంటుంది.
Continues below advertisement