Kesineni Quits Politics |రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కేశినేని నాని | ABP Desam

Continues below advertisement

Kesineni Quits Politics | వైసీపీ ఘోరమైన ఓటమి తరువాత మాజీ ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన చేశారు. రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఐతే.. సడన్ గా ఎందుకీ నిర్ణయం..?విజయవాడ: ఏపీ ఎన్నికల ఫలితాల తరువాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయాల నుంచి తప్పుకున్నారు. రాజకీయాలకు రిటైర్మెంట్ నిర్ణయాన్ని సోషల్ మీడియా ఎక్స్ ద్వారా ప్రకటించారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా విజయవాడ స్థానం నుంచి పోటీ చేసిన కేశినేని నాని ఓడిపోయారు. టీడీపీ నుంచి బరిలోకి దిగిన సోదరుడు కేశినేని చిన్ని 2 లక్షల 82 వేల 85 ఓట్ల తేడాతో కేశినాని నానిపై ఘన విజయం సాధించారు. 

 

టీడీపీ నుంచి రెండు పర్యాయాలు టీడీపీ పార్టీ నుంచి విజయవాడ ఎంపీగా కేశినాని నాని గెలుపొందారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలకు ముందు అప్పటి అధికార పార్టీ వైసీపీలో చేరారు. సిట్టింగ్ ఎంపీకి వైసీపీ విజయవాడ లోక్‌సభ టికెట్ ఇచ్చింది. కానీ రాష్ట్రవ్యాప్తంగా కూటమి హవా కొనసాగడంతో కేశినాని నాని ఎన్నికల్లో ఓటమి చెందారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram