Kesineni Brothers Fight: కారు స్టిక్కర్ విషయమై విజయవాడలో కేశినేని సోదరుల మధ్య విభేదాలు| ABP Desam

తన పేరు, హోదాను వినియోగించుకుని గుర్తుతెలియని వ్యక్తులు కొన్ని వ్యవహారాలు నడిపిస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని నాని ఫిర్యాదు చేశారు. తన వాహనానికి ఉన్న వీఐపీ స్టిక్కర్ కు నకిలీది సృష్టించి విజయవాడ, హైదరాబాద్ లో వాడుకుంటున్నారని ఆరోపించారు. ఆయన ఫిర్యాదులో ఓ వాహన నంబర్ ను పేర్కొన్నారు. ఇదే విషయంపై కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్ని స్పందించారు. చిన్న విషయంలోకి కుటుంబాన్ని లాగడం బాధాకరమన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola