Kasu Mahesh Reddy About YSRCP Defeat | అవమానమే ఓటమికి కారణం అంటున్న వైసీపీ నేత కాసు మహేష్| ABP Desam

ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  వైసీపీ ఘోర ఓటమి చవిచూసింది. వైసీపీ పరాజయానికి ఆ పార్టీకి చెందిన నేతలు ఒక్కొక్కరుగా కారణాలను విశ్లేషించుకుంటున్నారు. ఇలాంటి పరాభవానికి కారణం ఏమై ఉండొచ్చన్న దానిపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తమ ఓటమి పైన ఇప్పటి వరకు వైసీపీ నేతలు అనేక రకాల విశ్లేషణలు చేశారు. వై నాట్ 175 నినాదంతో ఎన్నికల బరిలో దిగిన వైసీపీ రాష్ట్రంలో కేవలం 11 స్థానాలకే పరిమితం అయింది. ఈ ఎన్నికల ఫలితాల పైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ విజయానికి, వైసీపీ ఓటమికి కారణాలు ఇవేనంటూ సోషల్ మీడియాలో ఓ  వీడియోను షేర్ చేశారు. ఈ కారణాలే చంద్రబాబులో ఆయన పార్టీలో  కసిని పెంచాయని ఆయన విశ్లేషించారు. 2019 లో జగన్.. 2024లో చంద్రబాబును గెలిపించింది ఆయా పార్టీల కేడర్ కసినే అంటూ చెప్పుకొచ్చారు. వైసీపీ ఓటమిపై మహేష్ రెడ్డి నిర్వేదం వ్యక్తం చేశారు. వైసీపీ ఓడిపోవడానికి  నాసిరకం మద్యమే ప్రధాన కారణం అని చెప్పారు. మందు తాగే వాళ్లు వైసీపీకి ఓటు వేయలేదన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola