
Karthi Visits Tirumala | పవన్ తో వివాదం తర్వాత తొలిసారి తిరుమలకు కార్తీ | ABP Desam
తిరుమల శ్రీవారిని హీరో కార్తీ దర్శించుకున్నారు. కుటుంబంతో కలిసి తిరుమలకు వచ్చిన కార్తీ….స్వామి వారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయం బయట కార్తీతో ఫోటోలు దిగేందుకు భక్తులు ఉత్సాహం చూపించారు. సత్యం సుందరం సినిమా ప్రమోషన్స్ సందర్భంగా తిరుమల లడ్డూపై కార్తీ చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. దానిపై కార్తీ బాధ్యతగా మాట్లాడాలంటూ ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ అవ్వటం...కార్తీ ట్విట్టర్ వేదికకగా తను కూడా వెంకటేశ్వరస్వామి భక్తుడిని అని..తెలిసో తెలియకో ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని ట్వీట్ పెట్టడం జరిగాయి. ఆ తర్వాత తొలిసారిగా కార్తీ...తిరుమల శ్రీవారిని ఈరోజు దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకుని చాలా కాలం అయినందున దర్శనం కోసం వచ్చానని...త్వరలో ఖైదీ 2, సర్దార్ 2 సినిమాలు వరుసగా వస్తున్నాయన్నారు కార్తీ. పవన్ కళ్యాణ్ తో వివాదం తర్వాత కార్తీ తిరుమలకు వచ్చి తన భక్తిని చాటుకోవటంపై సర్వత్రా చర్చ మొదలైంది. పవన్ కళ్యాణ్ అప్పట్లోనే కార్తీ కొత్త సినిమా సత్యం సుందరంకు విషెస్ చెప్పి గొడవను సద్దుమణిగించారు.