ఆ చెరువు వద్ద పందులు ఎక్కువగా ఉన్నాయ్, అందుకే చిరుత వస్తోంది - డీఎఫ్ఓ
రాజమండ్రిలో చిరుత సంచారం అలజడి సృష్టిస్తున్న క్రమంలో DFO భరణి కీలక విషయాలు వెల్లడించారు. వర్షం వల్ల చిరుత పాదముద్రలు కనపడటంలేదని, ఆటోనగర్ ప్రాంతంలో చిరుత జాడ కనిపించిందని తెలిపారు. ట్రాప్ కెమెరాలో చిరుత కదలికలు రికార్డ్ అయ్యాయని, జంతువుల అరుపుల ఆధారంగా ట్రాప్ కెమెరాలు పెట్టినట్టు వివరించారు. నాలుగు ట్రాప్ కేజీలు ఏర్పాటు చేశారు. చిరుతను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వారం రోజులపాటు పుష్కర నగరవనాన్ని మూసేస్తున్నట్టు చెప్పారు. ప్రజలు ఎక్కువగా బయటకు రాకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. చిరుత పాదముద్రలు గుర్తిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పాంప్లెట్స్ పంచుతున్నారు. అయితే...ఒకటే చిరుత ఉందా...ఇంకా ఎక్కువ ఉన్నాయా అన్నది పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు అధికారులు. ప్రస్తుతం మగ చిరుత సంచరిస్తున్నట్టు గుర్తించారు. ఎక్కువగా చీకట్లోనే చిరుత సంచరిస్తోందని తెలిపారు. పొలం పనులకు వెళ్లి అక్కడే నిద్రించొద్దని రైతులకు సూచిస్తున్నారు. దివాన్ చెరువు ప్రాంతంలో పందులు ఎక్కువగా ఉన్నాయని, వాటి కోసమే చిరుత వస్తోందని చెబుతున్నారు.