Kadiyam Costly Bonsai Plant | చెట్టు దుంగలా కనిపిస్తున్న ఈ మొక్క రేట్ ఎంతో తెలుసా | ABP Desam

దేశ విదేశాల‌కు చెందిన విభిన్న మొక్క‌ల‌తో క‌నువిందు చేసే క‌డియం న‌ర్స‌రీలో ఏదో ఓ ప్ర‌త్యేక‌త క‌నిపిస్తూనే ఉంటుంది.. అందుకే అంబానీ అంత‌టి వాడే నేరుగా త‌న వారిని క‌డియం పంపించి తాను గుజ‌రాత్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన పార్కులో ఇక్క‌డి నుంచే ల‌క్ష‌ల రూపాయ‌లు వెచ్చించి మొక్క‌ల‌ను తీసుకెళ్లారు... ఒక‌ప్ప‌డు దేశీయ జాతుల‌కు చెందిన మొక్క‌ల‌ను అభివృద్ధి చేసే ప‌ద్ద‌తి నుంచి మ‌రికొన్నాళ్ల‌కు విదేశీజాతుల మొక్క‌ల‌ను క‌డ‌యం న‌ర్స‌రీల్లోనే అభివృద్ధి చేసే స్థాయికి చేరుకున్న ఇక్క‌డి రైతులు మ‌రింత విభిన్నంగా ఆలోచించి ఏకంగా విదేశాల్లో వందేళ్ల వ‌య‌సున్న మొక్క‌ల‌ను ప్ర‌త్యేక కంటైన‌ర్లు ద్వారా ఇక్క‌డికి ర‌ప్పించి అంత‌ర్జాతీయ స్థాయి న‌ర్స‌రీ మార్కెట్‌తో పోటీప‌డుతున్నారు.. ఇదిలా ఉంటే క‌డియం న‌ర్స‌రీలో ఇప్ప‌డు ఓ అరుదైన ఏళ్ల‌నాటి చెట్టు అంద‌రినీ ప్ర‌త్యేకంగా ఆక‌ర్షిస్తోంది.. ఎన్నో వెరైటీ బోన్సాయ్ మొక్క‌ల‌ను అభివృద్ధి చేసి న‌ర్స‌రీల నిండానింపిన అనుభ‌వం ఉన్న క‌డియం న‌ర్స‌రీ రైతులు తాజాగా తీసుకువచ్చిన  భారీ ఆకారంగ‌ల బోన్సాయ్ చెట్ల‌తో వృక్ష ప్రేమికుల‌ను అమితంగా ఆక‌ర్షిస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola