Kadapa Floods: కడప జిల్లా చెయ్యేరు నదీ పరివాహ ప్రాంతంలో వరద మిగిల్చిన విషాదం
కడప జిల్లా చెయ్యేరు నది పరీవాహక ప్రాంతంలో ఈరోజుకీ పరిస్థితి మారలేదు. వరద సృష్టించిన బీభత్సం ఇంకా కళ్లముందే కదలాడుతోంది. విపత్తు తప్పిపోయినా ఎక్కడ ఉండాలో తెలియకు ఇప్పటికీ కొంత మంది బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఓ వైపు ఉన్నదంతా వరద ఊడ్చిపెట్టేసింది. ఎక్కడ ఉండాలో తెలియని దైన్యంలో గుడారాల్లోనే బతుకీడుస్తున్నారు. వరద కల్లోలం సృష్టించిన తొగూరుపేటలో రాత్రిపూట బాధితులు అనుభవిస్తున్న దైన్యాన్ని చిత్రీకరించాలని ఏబీపీ దేశం భావించింది. మా ప్రతినిధి శ్రీకాంత్ ఆ ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఉన్న విషాదకర పరిస్థితులను ఈ వీడియోలో చూడండి.