KA Paul Advice To Chandrababu Naidu | సీఎం చంద్రబాబుకు కేఏ పాల్ సలహాలు

KA Paul Advice To Chandrababu Naidu | సీఎం చంద్రబాబుకు కేఏ పాల్ సలహాలు 

సీఎం చంద్రబాబు నాయుడికి కేఏ పాల్ సలహాలు ఇచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కలిసి పని చేద్దామంటూ పిలుపుని ఇచ్చారు.

కిలారి ఆనంద్  పాల్ అంటే ఎవరీయన అంటారేమో కానీ కేఏ పాల్ అంటే మాత్రం తెలియని వాళ్లు తెలుగు రాష్ట్రాల్లో లేరు. ఒకప్పుడు ఆయన కూటములు పెడితే లక్షల్లో జనం వచ్చే వారు. కానీ ఇప్పుడు ఆయనే ఎక్కడ మీడియా మైకులు ఉంటాయో అక్కడకు పరుగులు పెడుతున్నారు. అది ఆంధ్రానా తెలంగాణనా అన్నది ఆయనకు అనవసరం. వెళ్లడం మీడియా ముందు... ఔరా అనిపించే ప్రకటనలు చేయడం... రావడం ఆయనకు కామన్ అయిపోయింది. కేఏ పాల్ రాజకీయం చేస్తున్నాడో.. మీడియాలో పబ్లిసిటీ కోసమే రోజంతా పనిచేస్తున్నారో తెలియదు కానీ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ  సంచలనాత్మక ఇన్సిడెంట్ జరిగినా .. అక్కడ రాజకీయంగాతన ఉనికిని చాటుకుంటున్నారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola