Judicial Remand For Chandrababu Skill Development Scam: ఈ నెల 22వ తేదీ దాకా రిమాండ్
ఎట్టకేలకు 36 గంటలకుపైగా ఉత్కంఠ వీడింది. తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబుకు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు జారీ చేసింది. సీఐడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం..... ఈ నెల 22వ తేదీ దాకా రిమాండ్ విధించింది. చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించబోతున్నారు. శాంతిభద్రతలకు ఎక్కడా విఘాతం కలగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.