Jr NTR vs Nandamuri Balakrishna: శతజయంతి ఉత్సవాల వేళ మళ్లీ బయటపడ్డ విభేదాలు..?
హైదరాబాద్ లో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో చంద్రబాబు మాట్లాడిన మాటలు.... పరోక్షంగా జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించినవేనా అని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దానికి కారణం.... నిన్న ఈ వేడుకలకు తారక్ రాకపోవడమే అని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.