జగనన్నపై కారుకూతలు కూస్తార్రా? ఇక మొదలుపెడుతున్నా!

ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో మాజీ మంత్రి జోగి రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. మైలవరం సీఎంఆర్ కళ్యాణమండపంలో వైసీపీ నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశం జరిగింది. ‘‘నేను వైయస్ రాజశేఖరరెడ్డి శిష్యుడిని. నా జోలికి వస్తారనుకున్నా నాకుటుంబంలో నా కుమారుడిపైన కూడా కక్ష సాధింపులకు దిగుతున్నారు. నా జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు, ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు, అడగకుండా పెట్టేవాడే జగనన్న. జగనన్న మాట ప్రకారం 2019 లో సీటు త్యాగం చేసి ప్రక్కకెళ్ళాను. జగనన్న కి చెప్పా ఈ వ్యక్తి ఉండేవాడు కాదు, వెళ్ళిపోతాడని చెప్పా. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కి గతంలో సీటు ఇచ్చి అతనికి రావలసిన బకాయిలన్నిటికీ బటన్ నొక్కారు జగనన్న. బకాయిలన్నీ తీసుకుని జంప్ జిలానీ అన్నాడు ఎమ్మెల్యే. మా మోచేతి క్రింద నీళ్ళు త్రాగి, మా జెండా క్రింద గెలిచి పార్టీ మారి మా జగనన్న ని కారుకూతలు కూస్తార్రా? ఎన్ని కేసులు పెట్టినా బెదిరే వ్యక్తి కాదు ఈ జోగి రమేశ్. ఈ రోజు నుండి ప్రయాణం మొదలైంది, జనవరిలో మైలవరం లో వైసీపీ కార్యాలయం  ప్రారంభిస్తా’’ అని జోగి రమేష్ వ్యాఖ్యానించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola