JC Prabhakar Reddy Protest: జేసీ ఆందోళన, వ్యతిరేకంగా వైసీపీ నిరసన
తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. సీబీ రోడ్డులో మురుగునీరు రోడ్డుపై పెద్ద ఎత్తున నిలిచిపోవటంతో రోడ్డుపైనే కూర్చుని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళనకు దిగారు. మురుగునీటిలోనే కుర్చీలు వేసుకుని కౌన్సిల్ సభ్యులతో ఆందోళన చేశారు. ఆయనకు వ్యతిరేకంగా అక్కడే వైసీపీ శ్రేణులు నిరసన చేశారు. పోలీసులను భారీగా మోహరించారు. సమస్య పరిష్కరించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరిస్తే వెళ్ళిపోతామంటూ పోలీసులకు చేతులెత్తి మొక్కారు.