మేం చీమూ, నెత్తురు ఉన్న నాకొడుకులమే! బూతులతో రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్ రెడ్డి
అల్ట్రాటెక్ సిమెంట్ యాజమాన్యానికి జెసి ప్రభాకర్ రెడ్డి క్షమాపణ చెప్పారు. ‘‘ఐదేళ్లు నియోజకవర్గ అబివృద్ధి కోసం కష్టపడ్డాను. పొగరు, ప్రెస్టేజ్ వల్ల అన్నీ పొగొట్టుకున్నాను. గత ఐదేళ్లు చాలా నష్టపోయాను. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మాకు ఏమి లేదు డబ్బులు కోసం పాలిటిక్స్ లో వచ్చారా అని అంటున్నారు. 125 బస్సులు పొగొట్టుకున్నాను. ఆల్ ఇండియా పర్మిట్ తో అన్ని చోట్లా బస్సులు నడిపాను. మాకు చీము రక్తమే ఎక్కువ ఉంది. ఎవరికీ తలవొంచం. నా లారీలు అద్దాలు పగులగొట్టారు.. అయినా అధికారులు పట్టుకోలేదు. సిమెంట్ ఫ్యాక్టరీ మీద ఆధారపడి 30 వేలు మంది ఉన్నారు. ఫ్లయాష్ విషయంలో జరిగిన విషయాలను ఉన్నతాధికారులకు లేఖ ద్వారా తెలియజేశాను.. అయినా పట్టించుకోలేదు.. డబ్బులకు మమల్ని లొంగదీసుకోలేరు.. మా వెనుక ప్రజలున్నారు. వ్తెసీపీ హాయంలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మా ఇంటికి వచ్చిన సమయంలో.. ఒకటి సరెండర్ కావాలి.. లేదా ఊరు విడిచి వెళ్తారు అనుకున్నారు. అలాంటి సమయంలో నియోజకవర్గంలో ప్రజలు నా వెంటనడిచారు. వారికి రుణపడి ఉన్నాను’’ అని అన్నారు.