Jawan Karthik Final Journey | దేశం కోసం ప్రాణాలర్పించిన కార్తీక్ కు కన్నీటి వీడ్కోలు | ABP Desam

 జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదుల దాడిలో అమరవీరుడైన జవాన్ కార్తీక్ కు స్వగ్రామంలో ఘనంగా అంత్యక్రియలను నిర్వహించారు. చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలం రాగిమానుపెంట లో ప్రభుత్వ లాంచనాలతో  జవాన్ కార్తీక్ కు అంత్యక్రియలు నిర్వహించారు. తెల్లవారుజామును సైనిక అధికారులు కార్తీక్ పార్థివదేహాన్ని స్వగ్రామానికి తీసుకురాగా...రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధుల సమక్షంలో కార్తీక్ అంత్యక్రియలు జరిగాయి. సైనిక లాంఛనాలతో గాల్లోకి కాల్పులు జరిపి జవాన్లు కార్తీక్ కు తుదిసారి సెల్యూట్ చేయగా...గ్రామస్తులంతా జాతీయ పతాకాన్ని కార్తీక్ పార్థివదేహంపై ఉంచి ఊరేగింపుగా తీసుకువెళ్లి అంత్యక్రియలను నిర్వహించారు. దేశం కోసం అమరవీరుడైన కార్తీక్ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. జవాన్ కార్తీక్ ప్రాణత్యాగాన్ని దేశం మర్చిపోదని పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు కొనియాడారు. కార్తీక్ అంతిమయాత్రలో పాల్గొనేందుకు వేలాదిగా ప్రజలు, స్నేహితులు తరలివచ్చారు. కార్తీక్ అంతిమయాత్ర సందర్భంగా వందేమాతరం, అమర్ రహే కార్తీక్ నినాదాలతో బంగారుపాళ్యెం మండలంలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola