Janasena Leaders Protest Against YCP: వైసీపీ శ్రేణులు దాడి చేశారంటూ ఆందోళన

రాజమహేంద్రవరం గ్రామీణం మండలం తొర్రేడు గ్రామ సచివాలయం వద్ద వైసీపీ శ్రేణులు.... తమపై దాడి చేసినట్టు జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జగనన్న ఇళ్లు-ప్రజలకు కన్నీళ్లు కార్యక్రమంలో భాగంగా జనసేన నాయకులు కాలనీల వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకుంటున్నారు. సచివాలయం వద్ద తమను అడ్డుకుని వైసీపీ శ్రేణులు దుర్భాషలాడారని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. వారంతా అక్కడే ధర్నాకు దిగారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola