Pawan Kalyan: విశాఖలో పవన్ సభకు భారీగా తరలివచ్చిన ప్రజలు
Continues below advertisement
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి చేపట్టిన ఉద్యమానికి జనసేన పార్టీ మద్దతు తెలిపింది. విశాఖలో ఆదివారం భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ కూర్మన్నపాలెం గేటు వద్ద ఏర్పాటు చేసిన ఈ బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటానికి సంఘీభావం తెలిపారు. జనసేన నేతలు నాదెండ్ల మనోహర్, హరిప్రసాద్, విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నేతలు సభలో పాల్గొన్నారు. అంతకు ముందు విశాఖ ఎయిర్ పోర్టు నుంచి సభ ఏర్పాటుచేసిన కూర్మన్నపాలెం గేటు వరకు పవన్ కల్యాణ్ ర్యాలీగా వచ్చారు. ఆయన వెంట జనసైనికులు భారీగా తరలివచ్చారు.
Continues below advertisement
Tags :
Pawan Kalyan AP News Vizag Steel Plant Janasena Latest News Visakha Steel Plant Agitation Visakha Steel Plant Privitazation