JanaSainiks on Pithapuram Sabha | నాలుగు కాదు పవన్ కళ్యాణ్ కోసం 40కిలోమీటర్లైనా నడుస్తాం | ABP Desam

దారులన్నీ పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ వైపే పయనిస్తున్న పరిస్థితి తలెత్తుతోంది.. చిత్రాడలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభ సందర్భంగాతెలుగు రాష్ట్రాల నుంచి భారీస్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు తరలివస్తున్నారు.. సుమారు 4 కిలోమీటర్లు ముందే వాహనాలను ఆపివేడయంతో కార్యకర్తలు నడకతో సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ఎన్నో సుఖాలను వదులుకుని తమ కోసం ఎన్నో కష్టాలు పడుతూ పదేళ్ల పార్టీని తన భుజాలపై మోసిన తమ నాయుకుడు తొలిసారి అధికారంలో ఉండగా చేస్తున్న మొదటి సభ కావటంతో భారీ రేంజ్ లో ఉంటుందని కార్యకర్తలు భావిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న సభ కావటంతో ఆయన నుంచి పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం సంచలనన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు.  అలాంటి పరిస్థితులపై చిత్రాడ నుంచి ఏబీపీ దేశం ప్రతినిధి సుధీర్‌ జనసైనికుల అభిప్రాయాలతో చేస్తున్న స్పెషల్ వీడియో మీ కోసం మమీరూ చూసేయండి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola