ఇండియాలో ఐఫోన్ 16 సిరీస్ రేటు ఎంత?

Continues below advertisement

మోస్ట్ అవైటెడ్ ఐఫోన్ 16 సిరీస్‌ను కంపెనీ మార్కెట్లో లాంచ్ చేసింది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్థరాత్రి జరిగిన ఈవెంట్లో యాపిల్... ఐఫోన్ 16 సిరీస్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. భారతదేశంలో ఎంత రేటు ఉండనుందో కూడా వెంటనే ప్రకటించేశారు. రేట్లలో యాపిల్ పెద్దగా మార్పులు చేయలేదు. సర్‌ప్రైజింగ్లీ టాప్ ఎండ్ మోడల్ కాస్ట్‌ని లాస్ట్ వెర్షన్ కంటే కాస్త తగ్గించింది.

ఐఫోన్ 16 కాస్ట్ ఇండియాలో రూ.79,900 నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ వేరియంట్‌లో 128 జీబీ స్టోరేజ్ ఉంటుంది. అక్కడ నుంచి స్టోరేజ్ పెరిగే కొద్దీ రేటు పెంచుకుంటూ పోవాలి. ఐఫోన్ 16 ప్లస్ 128 జీబీ మోడల్ కాస్ట్ రూ.89,900 నుంచి స్టార్ట్ కానుంది.

ఐఫోన్ 16 ప్రో రేటు మనదేశంలో రూ.1,19,900 నుంచి స్టార్ట్ కానుంది. 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను ప్రో సిరీస్‌లో తిరిగి తీసుకువచ్చారు. ఐఫోన్ 15 ప్రో రేటు రూ.1,34,900 నుంచి స్టార్ట్ అయింది. స్టోరేజ్ తేడా ఉన్నా... తక్కువ స్టోరేజ్ సరిపోతుందనుకునే వారికి బేస్ వేరియంట్‌లో దాదాపు రూ.15 వేలు తేడా వచ్చిందనుకోవచ్చు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram