బంక్ లో సిబ్బందిని గంజాయి మత్తులో చితకబాదేశారు!
గుంటూరు జిల్లా జొన్నలగడ్డ వద్ద పెట్రోల్ బంక్ లో అర్థరాత్రి నలుగురు యువకులు వీరంగం సృష్టించారు. అక్కడే ఉన్న సేల్స్ మెన్ పై దాడి చేశారు. అతన్ని కాపాడ్డానికి వెళ్లిన మరో వ్యక్తిని చితకబాదారు. వాళ్లిద్దరిని కొట్టి వారి దగ్గరున్న సెల్ ఫోన్, రూ. 10 వేల క్యాష్ ను లాక్కెళ్లిపోయారు. గంజాయి మత్తులో ఉండటం వల్లే అలా చేశారని బాధితులు చెప్పారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
Tags :
ANDHRA PRADESH Guntur Andhra Pradesh News Ganjayi Petrol Bunk Cannabi Addicts Intoxicates Petrol Bunk Employees In Guntur