Illegal Mining In Amaravathi: అక్రమంగా మట్టి తవ్వుతుండగా పట్టుకున్న రైతులు
రాజధాని అమరావతి ప్రాంతంలో మరోసారి మట్టిదొంగలు రెచ్చిపోయారు. ఇవాళ తెల్లవారుజామున తుళ్లూరు మండలం వెంకటపాలెంలో రైతులకు ఇచ్చిన ప్లాట్లలో అక్రమంగా మట్టి తవ్వుతుండగా గ్రామస్థులు వారిని పట్టుకున్నారు. ఉద్ధండరాయునిపాలానికి చెందిన వ్యక్తులు మట్టి తరలిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మట్టి తవ్వుతున్నవారిని పట్టుకుని రైతులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో, వారు వచ్చి జేసీబీ, టిప్పర్ ను స్వాధీనం చేసుకున్నారు.