How To Use Shakthi App | శక్తి యాప్ తో ఎక్కడికెళ్లినా సేఫ్ గా ఉండండి | ABP Desam

Continues below advertisement

ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్ గా శక్తి యాప్ ని లాంచ్ చేసింది. మహిళల భద్రతే మా ఫస్ట్ ప్రయారిటీ అని అంటున్నారు సీఎం చంద్రబాబు. మహిళల కోసమే స్పెషల్ గా ఈ యాప్ డిజైన్ చేశామని అన్నారు. ఎలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈ యాప్ సహాయంతో దేగ్గర్లోని పోలీస్ స్టేషన్ ని సంప్రదించొచ్చు. శక్తి యాప్ లో  ఎస్ఓఎస్, సేఫ్ ట్రావెల్, గివ్  ఏ కంప్లెయింట్, మిస్సింగ్ చైల్డ్ రిపోర్ట్, నైట్ షెల్టర్స్, ఫ్యామిలీ కౌన్సలింగ్, ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ ని ఉపయోగించుకొని మనం ఉన్న చోట నుండే కంప్లెయింట్ ఫైల్ చేయొచ్చు. ఈ యాప్ ని ఎలా ఉపయోగించాలి ఇప్పుడు చూదాం. 

శక్తి యాప్ ని ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి.. ఓటిపి ద్వారా సైన్ ఇన్ ఆవలి. సైన్ ఇన్ అయి మీ డిటైల్స్ ని ఫిల్ చేయాలి. మీ పేరు, అడ్రస్, మొబైల్ నెంబర్ ... ఇలా అన్ని డిటైల్స్ ఫిల్ చేయాలి. ఈ యాప్ లో మీకు అందుబాటులో ఉండే రెండు ఎమర్జెన్సీ నంబర్స్ ని యాడ్ చేయాలి. మీ పేరెంట్స్, బ్రదర్, సిస్టర్, గ్రాండ్ పేరెంట్స్ ఇలా మీకు ఎవరైతే అందుబాటులో ఉండే నంబర్స్ ని పెట్టుకోవాలి. 

మెయిన్ పేజ్ లో మీకు sos ఆప్షన్స్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే మీ కెమెరా ఓపెన్ అయి ఆటోమేటిక్ గా 10 సెకండ్స్ వీడియో రికార్డ్ అయిపోతుంది. రికార్డు ఐన వెంటనే మీరు ఉన్న లొకేషన్ కి దేగ్గర్లోని పోలీస్ స్టేషన్ కి చేరుతుంది. 

మీ పిల్లలు ఎక్కడైనా తప్పిపోతే రిపోర్ట్ ఆ చైల్డ్ ఆప్షన్ తో వెంటనే కంప్లెయింట్ ఫైల్ చేయొచ్చు. పోలీసుల సహాయంతో మీ  పిల్లలను వెతికి పట్టుకోవచ్చు. 

నైట్ షెల్టర్స్ ఆప్షన్ ఉపయోగించి మీరు రాత్రులు ఎక్కడైనా చిక్కుకుపోతే  ఈ ఆప్షన్ ద్వారా మీకు దేగ్గర్లోని షెల్టర్ కి వెళ్లొచ్చు. మీరు నైట్ టైం లో ఎలాంటి గృహ హింసకు గురైనా కూడా ఈ ఆప్షన్ ద్వారా మీరు షెల్టర్ పొందొచ్చు. ఇలా ఈ యాప్ ద్వారా మీరు అక్కడున్న కూడా సేఫ్ గా ఉండొచ్చు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola