Hero Vishwak Sen Tirumala Darshan | తిరుమల శ్రీవారి సేవలో హీరో విశ్వక్ సేన్ | ABP Desam
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో హిట్ కొడుతున్నానని కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు హీరో విశ్వక్ సేన్. ఈనెల 31 న థియేటర్లలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదల అవుతున్న సందర్భంగా సినిమా యూనిట్ తో కలిసి తిరుమల శ్రీవారి సేవలో విశ్వక్ సేన్ పాల్గొన్నారు. స్వామి వారి సినిమా రిలీజ్ కు ముందు వచ్చి దర్శించుకోవటం తనకు సెంటిమెంట్ గా మారిందన్నారు. విశ్వక్ తో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు.
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'లో లంకల రత్న పాత్రలో విశ్వక్ సేన్ నటించారు. యువ నాయకుడు రత్న అంటే బలంగా రాయమని 'హైపర్' ఆదితో చెబుతాడు హీరో. ఆ తర్వాత అంజలి, నేహా శెట్టిలను చూపించారు. నేహాతో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నట్టు చూపించారు.
'నా ఊరిలో నాకేటి భయం' అనే రకం హీరో. అతడి మీద పోలీసులు ఎందుకు అరెస్ట్ వారెంట్ విడుదల చేశారు? 'ఈ సమస్య వాడు పొతే వాడితో పోద్ది' అని నాజర్, ఆ తర్వాత 'లేదంటే ఊరే పోద్ది' అని మరో నటుడు ఎందుకు చెప్పారు? అనేది సిల్వర్ స్క్రీన్ మీద చూడాలి. 'నేను నీలా చదువుకోలేదు. నాకు తెలిసిందల్లా ఒక్కటే... మన మీదికి ఎవడైనా వస్తే వాడి మీదికి పడిపోవడమే' అని చెప్పే మాటలో హీరో క్యారెక్టరైజేషన్ చెప్పారు దర్శకుడు కృష్ణచైతన్య.