తూర్పుగోదావరి జిల్లాలో కుండపోతగా వర్షం.. తెగిపోయిన అన్నవరం, ఉమ్మడివరం మధ్య వంతెన
తూర్పుగోదావరి జిల్లాలో కుండపోతగా వర్షం పడింది. వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పోర్లుతున్నాయి. చింతూరు, వి.ఆర్ పురం మండలాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. ఏ. జి కోడెర్, జల్లివారి గూడెం మధ్య ఉన్న చంద్రవంకవాగు పొంగుతోంది. రాకపోకలు నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అన్నవరం, ఉమ్మడివరము మధ్య వంతెన తెగింది. పూర్తిస్థాయిలో రాకపోకలు నిలిచిపోయాయి.