Gudlavalleru Engineering College Incident | గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో ఘోరం | ABP Desam

 గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో దారుణం వెలుగు చూసింది. ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన అమ్మాయిల హాస్టల్ బాత్రూంలో ఓ కెమెరా ఉండటాన్ని అమ్మాయిలు గుర్తించారు. దీనిపై హాస్టల్ వార్డెన్ కు ఫిర్యాదు చేయగా...అదే కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థి తన స్నేహితురాలితో కలిసి ఈ విధంగా అమ్మాయిల బాత్రూంలో కెమెరాలు పెట్టించి వీడియోలు తీయిస్తున్నట్లు గుర్తించారు. వాటిని కాలేజీలో విద్యార్థులకు విక్రయిస్తున్నట్లుగా కూడా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ఆగ్రహించిన విద్యార్థులు అర్థరాత్రి ఇంజినీరింగ్ కాలేజీలో ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ కాలేజీ, హాస్టల్ యాజమాన్యంపై మండిపడ్డారు. ఘటనకు కారణమైన విద్యార్థిపై సహచర విద్యార్థులు దాడికి దిగినట్లు తెలుస్తోంది. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. ఇప్పటివరకూ ఈ ఘటనపై అధికారికంగా ఏ సమాచారం బయటకు రాలేదు. ఎంత అమ్మాయిల వీడియోలను తీశారు దీనికి కారణం ప్రేమ వ్యవహారామా..లేదా ఘటనకు కారణమైన అమ్మాయిని బెదిరించి ఇదంతా చేయించారా అన్న కోణాల్లోనూ సమాచారాన్ని అధికారులు బయటకు చెప్పటం లేదు. విద్యార్థులు ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola