ABP News

Vallabhaneni Vamsi Arrest | గన్నవరం మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసిన పోలీసులు | ABP Desam

Continues below advertisement

 గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. సత్యవర్థన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడిన కేసులో వంశీని హైదరాబాద్ లో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని రాయదుర్గంలోని మైహోం భూజాలో పోలీసులు వంశీని అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకువెళ్లారు. వైసీపీ హయంలో గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి చేసిన కేసులో వల్లభనేని వంశీ ఏ71గా ఉన్నారు. 
అప్పుడు తన మీద ఫిర్యాదు చేసిన టీడీపీ ఆఫీస్ కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్థన్ ఆ తర్వాత తనకు ఈ కేసుతో సంబంధం లేదంటూ కోర్టులో అఫిడవిట్ సమర్పించాడు. సడెన్ గా సత్యవర్థన్ కేసు వెనక్కి తీసుకోవటంపై ఆరా తీసిన పోలీసులుకు...వంశీ సత్యవర్థన్ ను కిడ్నాప్ చేసి బెదిరించినట్లు తెలిసింది. దీంతో వల్లభనేని పై కిడ్నాప్, ఎస్సీఎస్టీ కేసును నమోదు చేసిన పోలీసులు హైదరాబాద్ లో ఉన్నాడని తెలిసి వచ్చి అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకువెళ్లారు. ఈకేసుతో పాటు మరో 4-5 కేసుల్లో వంశీ నిందితుడిగా ఉన్నారు

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram