హిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?
సాధారణంగా చర్చికి క్రైస్తవులే వెళ్తుంటారు.. కానీ కులమతాలకు అతీతంగా అన్నివర్గాలు వెళ్లి మోకరించి మరీ ప్రార్ధన చేసే ఆలయం ఒకటి ఉందని మీకు తెలుసా.. కేంద్రపాలిత ప్రాంతం అయిన యానాంలో సెయింట్ ఆన్స్ రోమన్ కాథలిక్ చర్చి అత్యంత పురాతన చర్చిల్లో ఇది ఒకటి.. ఫ్రెంచ్ పాలకుల స్మారక చిహ్నంగా ఈ క్యాథలిక్ చర్చి ఉంది.
ఫ్రెంచ్ వర్తకుల ఫ్రెంచ్ ఎన్‌క్లేవ్‌గా యానాం ఉన్నందున 1750 సంవత్సరంలో ఇక్కడ నీలిమందు కర్మాగారాన్ని నిర్మించారని, ఈక్రమంలోనే ఫ్రెంచ్‌వారు ఈచర్చిని 1768లో నిర్మించారని అంటారు. అయితే అది 1768లో వచ్చిన తుపాను కారణంగా కూలిపోగా ఫాదర్ మిచెల్ లెక్నామ్ 1846లో పూర్తిస్థాయిలో నిర్మాణం పూర్తిచేశారని చెబుతుంటారు. ఈ చర్చికి సంబందించి చాలా నిర్మాణ, అలంకార సామాగ్రి ఫ్రాన్స్ నుంచి తెప్పించారట.. చర్చి నిర్మాణం యూరోపియన్ గోథిక్ శైలిలో నిర్మాణం చేపట్టడం కనిపిస్తుంది. ఆ సమయంలోనే ఒక బావిని తవ్వించి అదే నీటిని సేవించేవారు.. ఆ బావి ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండగా ప్రస్తుతం నీళ్లు చేదుకునేందుకు బావి వద్దకు వచ్చిన సమరయ స్త్రీతో తానిచ్చు జీవజలం గురించి యేసు చెబుతున్న వృత్తాంతం అద్భుతంగా చిత్రీకరించారు.