
GV Harsha Kumar on MLC Election | ఎమ్మెల్సీ ఎన్నికల తీరుపై హర్ష కుమార్ ఫైర్ | ABP Desam
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ రిగ్గింగ్ కి పాల్పడుతోందని సంచలన ఆరోపణలు చేశారు మాజీ ఎంపీ హర్ష కుమార్. ఆయన తనయుడు జీవీ సుందర్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తుండగా...ఈరోజు జరుగుతున్న ఎన్నికల్లో స్లిప్లుల పంపిణీ దగ్గర నుంచి బూత్ లోకి పోలింగ్ ఏజెంట్లను రానీయకుండా అడ్డుకోవటం వరకూ అడుగడుగునా టీడీపీ అధికార దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. జీవీ సుందర్ తరపున పోలింగ్ బూత్స్ తిరుగుతున్న హర్ష కుమార్, ఆయన పెద్ద కుమారుడు శ్రీరాజ్ ఎక్కికడక్కడ పోలింగ్ బూత్ లో జరుగుతున్న వాటిని నిలదీస్తూ వీడియోలు విడుదల చేస్తున్నారు. టీడీపీ తన అధికారాన్ని అడ్డు పెట్టుకుని బూత్స్ లో రిగ్గింగ్ చేస్తూ ఓట్లు దండుకుంటున్నారని అంటూ హర్ష కుమార్ ఆరోపించారు. హర్ష కుమార్ తో పాటు ఆయన కుమారులు ఎమ్మెల్సీ అభ్యర్థి జీవీ సుందర్, మరో తనయుడు జీవీ శ్రీరాజ్ కూడా ఉన్నారు. ప్రిసైడింగ్ అధికారులను కలిసి కంప్లైంట్ ఇచ్చిన హర్ష కుమార్ ఘటనను ఈసీకి రిపోర్ట్ చేయాలని సూచించారు.