Food Items Menu Janasena Pithapuram Sabha | పిఠాపురం సభలో 10వేల మందికి భోజనాలు | ABP Desam

జనసేన పార్టీ 12 ఆవిర్భావ దినోత్సవ సభకు వచ్చే అతిధులకు, సభా నిర్వాహణకు విధి నిర్వాహణలో ఉన్న సిబ్బంది, పోలీసులు, మీడియా ప్రతినిధులతోపాటు జనసేన పార్టీ నాయకులకు పార్టీ సభా ప్రాంగణం వద్ద సుమారు 10 వేల మందికి భోజనాలు తయారు చేయిస్తోంది.. శాఖాహార భోజనాల ఏర్పాట్లు అన్నీ కమిటీలు దగ్గరుండి చూసుకుంటున్నాయి.. భోజనాల మెనూలో ప్రధానంగా విజిటబుల్‌ బిర్యానీ, కాయకూరలతోపాటు ప్రత్యేక వంటకంగా అన్నవరం ప్రసాదం తయారు చేయించారు..  జనసేన ప్లీనరీకోసం ఏమే వంటలు తయారు చేశారు.. వంటశాల నుంచి ఏబీపీ దేశం స్పెషల్ రిపోర్ట్ ప్రేక్షకులకు అందిస్తున్నాం. అంతే కాకుండా చాలా కమిటీలను ఏర్పాటు చేసుకుని సభ కు వచ్చే కార్యకర్తలకు ఆకలి బాధ లేకుండా ప్రణాళికలు రచించారు. ముందస్తుగా వచ్చే జనాభాను అంచనావేసుకుని వారికి తగినట్లుగా భోజన ఏర్పాట్లను చేయటంతో పాటు వృద్ధులకు, మహిళల కోసం ప్రత్యేక కమిటీలతో వాళ్లకు ఆహార పంపిణీ వాళ్ల దగ్గరకే తీసుకువెళ్లి చేసేలా చేసిన ఏర్పాట్లపై స్పెషల్ స్టోరీ  

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola