Flexis Against Chandrababu In Pileru: చంద్రబాబుకు వ్యతిరేకంగా పీలేరులో ఫ్లెక్సీలు

అన్నమయ్య జిల్లా పీలేరులో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏర్పాటైన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. రొంపిచర్ల అల్లర్లలో అరెస్టై పీలేరు సబ్ జైల్లో ఉన్న 8 మంది టీడీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు చంద్రబాబు ఇవాళ వెళ్లనున్నారు. పెద్దిరెడ్డి కుటుంబంపై బురద జల్లే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నారని, గో బ్యాక్ అంటూ వైసీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మత కలహాలు సృష్టిస్తున్న సైకో చంద్రబాబు గోబ్యాక్ అంటూ ఫ్లెక్సీలపై రాసి ఉంది. చంద్రబాబు పర్యటన దృష్ట్యా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola