Fishing in Yanam | చేపలు పట్టడంలో ఇదో కొత్త పంథా

Continues below advertisement

సాధారణంగా చేపలు వలల ద్వారా కానీ, లేదా గేలం ద్వారా కానీ పడుతుంటారు.. కానీ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పక్కనే ఉన్నటువంటి పుదుచ్చేరీ యానాంలో కుర్రాళ్లు మాత్రం వినూత్నంగా చాలా సునాయాసంగా చేపలను ఇట్టే పట్టేస్తున్నారు.. ఒడిస్సాకు చెందిన యూట్యూబ్‌ చానెల్‌లో ఓ వీడియో చూసిన ఇక్కడి యువకులు వాటర్‌ బాటిల్‌ కట్‌ చేసి ఆపై వాటికి బీడు పూసలు. బరువు కోసం కట్టి వైరు తాడు ద్వారా గౌతమి నదిలో పెద్ద పెద్ద చేపలను ఇట్టే పట్టేస్తున్నారు. ఈ చేపలకు ఎరగా మైదాపిండి కలిపి పెడుతున్నారు.. ప్రస్తుతం ఈ చేపలు పట్టే వీడియోలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. యానాంలోని గౌతమి నదీఒడ్డుకు పెద్దఎత్తులో యువకులు, చిన్నపిల్లలు తరలివస్తుండతంతో యానాం పోలీసులు గస్తీ కూడా కాస్తున్నారు.. చేపల కోసం వస్తున్నవారు నదిలోకి జారిపడిపోయే ప్రమాదం ఉన్నందున ఇక్కడ చేపలు పట్టకుండా నిలువరిస్తున్నారు. ఈ విధంగా చేపలు పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola