Farmer Stopped CM Chandrababu Convoy | సీఎం చంద్రబాబు కాన్వాయ్ ఆపడానికి ప్రయత్నించిన రైతు

Continues below advertisement

కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. అయితే ఈ పర్యటనలో సీఎం కాన్వాయ్ ఆపడానికి గంగాధర్ అనే వ్యక్తి ప్రయత్నించాడు. దాంతో వెంటనే చంద్రబాబు కాన్వాయ్ ను ఆపారు. గొల్లప్రోలులో గత ప్రభుత్వంలో జరిగిన రీ సర్వేలో తప్పులు జరిగాయని... అధికారులు పట్టించుకోవడంలేదని సీఎం దృష్టికి తీసుకెళ్లారు గంగాధర్. 70 సార్లు ఫిర్యాదు చేసినా కూడా అధికారులు పట్టించుకోవడంలేదని సీఎంకు వివరించారు. గంగాధర్ ఫిర్యాదుతో సమస్యను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కు సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారు. వివరాలు తెలుసుకుని సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆ రైతుకు చంద్రబాబు హామీనిచ్చారు. అక్కడే గంగాధర్‌తో పాటు పలువురి నుంచి సీఎం చంద్రబాబు వినతి పత్రాలను స్వీకరించారు.

ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దాలంటే ప్రజల ఆలోచనా విధానం మారాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో జరిగిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర సభలో ఆయన ప్రసంగించారు. ఏపీ రాజధాని అమరావతి మునిగిపోయిందని, వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని.. తమది విజనరీ పాలిటిక్స్ అయితే, వైసీపీది ప్రిజనరీ పాలిటిక్స్ అని ఎద్దేవా చేశారు.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola