Farmer Protest Created Tension: రైతుల ఆందోళనలో తోపులాట, సొమ్మసిల్లి పడిపోయిన మహిళా రైతులు| ABP Desam
Srikakulam జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలెం గ్రామంలో, నారాయణపురం భూమి వివాదం వరుసగా రెండో రోజూ రాజుకుంది. పెత్తందారులు కొందరు... భూమిని జేసీబీలతో చదును చేస్తున్నారంటూ రైతులు వారి పనులకు అడ్డుపడ్డారు. అక్కడ బందోబస్తుగా ఉన్న పోలీసులు.... రైతులందర్నీ అదుపులోకి తీసుకున్నారు. భూములు తమకే కావాలంటూ రైతులు ఆందోళన కొనసాగించారు. రైతులు, పోలీసుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తోపులాటలో కొందరు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు.