Breaking News | Ex Minister Narayana Arrested: మాజీ మంత్రి నారాయణ Hyderabad లో అరెస్ట్ | ABP Desam

మాజీ మంత్రి, తెలుగుదేశం నాయకుడు, నారాయణ విద్యాసంస్థల అధినేత Narayana ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. Hyderabad లోని Kondapur కు చేరుకున్న పోలీసులు... నారాయణను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల సమయంలో అనేక చోట్ల ప్రశ్నపత్రాల లీకేజీ కలకలం రేగింది. చిత్తూరు జిల్లాలో ఓ చోట లీకేజీ వ్యవహారంలో ప్రైవేట్ విద్యాసంస్థలకు చెందిన సిబ్బందే ఉండటం తీవ్ర సంచలనంగా మారింది. అందులో నారాయణ విద్యాసంస్థల్లో పనిచేసే సిబ్బంది కూడా ఉండటం గమనార్హం. ఇప్పుడు అదే కేసుకు సంబంధించి నారాయణను అరెస్ట్ చేసినట్టు సమాచారం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola