EC Decision on Loose Petrol and Diesel | కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం | ABP Desam
ఎన్నికల తర్వాత జరుగుతున్న హింసాత్మక ఘటనలు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నందున్న కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఓ వైపు చెలరేగిన హింసపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధం చేసింది. ఈ నివేదికను ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్ అందజేశారు. ఎన్నికల సమయంలో పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. దీనిపై విచారణ చేపట్టాలని వినీత్ బ్రిజ్‌లాల్ ఆధ్వర్యంలో 13 మందితో సిట్ బృందాన్ని ఏర్పాటు చేయడం తెలిసిందే. మరోవైపు ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాలను తగులబెడుతున్న ఘటనలు పెరుగుతున్న దృష్ట్యా పెట్రోల్ బంకుల యాజమాన్యాలకు కేంద్రం ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎలక్షన్ కోడ్ ముగిసే వరకూ లూజులో పెట్రోలు, డీజిల్ విక్రయాలపైన ఆంక్షలు విధిస్తున్నట్లు ఆదేశాలు జారీచేసింది. వాహనాల్లో తప్ప విడిగా అంటే బాటిల్స్, సీసాలు, డ్రమ్ముల్లో పెట్రోల్, డీజిల్ పట్టకూడదని లూజుగా విక్రయించకూడదని ఈసీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఏపీలోని పెట్రోల్ బంకుల్లో అదికారులు ఆ నోటీసులను అంటిస్తున్నారు. ఈ ఆదేశాలపై పెట్రోల్ బంకు నిర్వాహకులు ఏం అంటున్నారు వాళ్లు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటీ..ప్రజలకు ఈ సమాచారాన్ని ఎలా చేరవేస్తున్నారు..ఈ వీడియోలో చూద్దాం.