సంస్కృతి సంప్రదాయాలు కాపాడేందుకే ఈ పోటీలు
సంక్రాంతి పండుగ సందర్భంగా కోనసీమ జిల్లాల్లో రంగవల్లుల పోటీలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని బండారులంక గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించాయి. మహిళలు, యువతులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని వివిధ రకాల రంగవల్లులు వేశారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు ఎంపిక చేసి వారికి బహుమతులు ఇచ్చారు. కనుమరుగవుతున్న సంప్రదాయాల్లో భాగంగా రంగవల్లుల పోటీలు నిర్వహించి తద్వారా సంస్కృతిని కాపాడే ప్రయత్నం ఈ పోటీలకు మూలకారణమని నిర్వాహకులు తెలిపారు.
Tags :
Sankranthi 2022 Sankranthi Kolam East Godavari Sankranthi Sankranthi Muggulu Sankranthi Muggulu Competition