తెలుగు రాష్ట్రాల్లో భూకంపం, గుబులు పుట్టిస్తున్న వీడియోలు
తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఉన్నట్టుండి భూ ప్రకంపనలు నమోదయ్యాయి. తెలంగాణలో వరంగల్, ఖమ్మం సహా మరి కొన్ని చోట్ల 5 సెకన్ల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రత నమోదైంది. అటు ఏపీలోనూ భూ ప్రకంపనలు నమోదయ్యాయి. అయితే..ఈ ప్రకంపనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు. కొన్ని సెకన్ల పాటు భూమి ఎలా కంపించిందో ఈ వీడియోలు చూస్తే అర్థమవుతోంది. ఇళ్లలో, వీధుల్లో పెట్టిన సీసీ కెమెరాల్లో ఈ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. వీటిని షేర్ చేస్తూ నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. కొద్ది సేపటి వరకూ భూమి కంపించిపోయిందని, చాలా భయపడిపోయామని చెబుతున్నారు. 2 సెకన్ల పాటు భూమి కంపించింది. కొన్ని చోట్ల ప్రజలు ఇళ్లలో నుంచి పరుగులు తీశారు. ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఈ ప్రకంపనలు నమోదయ్యాయి. కొన్ని చోట్ల 5 సెకన్ల పాటు భూమి కంపించినట్టు సోషల్ మీడియాలో కొంత మంది పోస్ట్‌లు పెడుతున్నారు.