
Dwarapudi Adiyogi Statue | కోయంబత్తూరు వెళ్లలేని వాళ్లకోసం ద్వారపూడికే ఆదియోగి | ABP Desam
తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులో ఇషా పౌండేషన్ ప్రాంగణంలో నిర్మించిన ధ్యానయోగి విగ్రహాన్ని చూసే ఉంటారు... నేరుగా చూడకపోయినా కనీసం వీడియోల్లో చూసే ఉంటారు.. అచ్చం అదే నమూనాలో ఓ ధ్యానయోగి విగ్రహాన్ని ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రికి అత్యంత సమీపంలో ఉన్న ద్వారపూడి లో చూడవచ్చు.. ద్వారపూడిలో ఇప్పటికే అయ్యప్పస్వామి టెంపుల్ చాలా ఫేమస్.. ఆ ఆలయానికి ఆనుకునే ఈధ్యానంలో ఉన్న శివుని విగ్రహాన్ని నిర్మించారు.. 60 అడుగులు ఎత్తు, 100 అడువుల వెడల్పులో నిర్మించిన ఈ ధ్యానయోగి విగ్రహం ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.. ఎస్.ఎల్.కనకరాజు గురుస్వామి, శ్రీమతి పొన్‌ముడి దంపతులు ఈ విగ్రహ నిర్మాణానికి పూనుకున్న క్రమంలో కొందరు భక్తులు కూడా విరాళాలు అందించగా ఈ జ్ఞాన యోగి విగ్రహాన్ని సుమారు రూ.కోటితో నిర్మించారు. 90 శాతంకు పైగా నిర్మాణ పనులు అన్నీ పూర్తిచేసుకోగా ఫోరింగ్ గ్రానైట్ పనులు వేగంగా చేస్తున్నారు.. ఈనెల 26న మహాశివరాత్రిని పురస్కరించుకుని ఈ విగ్రహాన్ని ప్రారంభించనున్నారు. ఇక్కడి విగ్రహం లోపల కూడా ధ్యాన మందిరాన్ని నిర్మించారు. ధ్యాన మందిరంలో కూడా శివలింగం, శివుడు విగ్రహాలను ఏర్పాటు చేశారు. అక్కడ కూర్చుని ధ్యానం చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఇక విగ్రహం చుట్టూ పురాణాల్లో ఉన్న రుషులు, మహర్షుల విగ్రహాలను ఏర్పాటు చేయగా ఆదిగురువు ముందు నంది విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పక్కనే వినాయక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ విగహ్రాలను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు తరలిసస్తున్నారు. సెల్ఫీలు, వీడియోలుతో సందర్శకులు సందడి చేస్తున్నారు.. ద్వారపూడి జ్ఞానయోగి విగ్రహం వద్ద నుంచి ఏబీపీ దేశం అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్