శ్రీశైలంలో కన్నుల పండువగా దసరా మహోత్సవాలు
శ్రీశైలంలో దసరా మహోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి. ఆలయ ప్రాంగణంలో నవదుర్గ అలంకార రూపంలో ఐదో రూపమైన స్కందమాత అలంకార రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి ఆలయ ముందు భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఆశీనులైన అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు.