Differences Exposed In Srikakulam YCP: వైసీపీ ప్లీనరీ సందర్భంగా బయటపడ్డ వర్గ విభేదాలు..?!| ABP Desam
Continues below advertisement
శ్రీకాకుళం జిల్లా పలాసలో వైసీపీలో నాయకుల మధ్య వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. పలాసలో వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ ఛైర్మన్ బల్ల గిరిబాబు కూడా అక్కడికి చేరుకున్నారు. కానీ ఆయనను వేదికపైకి పిలవకపోవడం అక్కడ స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. అధికార పార్టీ నాయకుడు, మున్సిపల్ ఛైర్మన్ అయినా సరే పిలవకపోవడం ఏంటంటూ గిరిబాబు వర్గీయుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే తమ ఆందోళన తెలియచేశారు. కాసేపటి తర్వాత గిరిబాబు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Continues below advertisement