Deputy CM Pawan kalyan on Allu Arjun | సంధ్యా థియేటర్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ | ABP Desam

Continues below advertisement

 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ సంధ్యా థియేటర్ ఘటనపై విలేకర్లుతో చిట్ చాట్ లో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆఫ్ ది రికార్డ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వందకు వందశాతం కరెక్ట్ అన్నారు పవన్ కళ్యాణ్. అసలు అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టే ఓ హీరోను అరెస్ట్ చేయగలిగారు అన్నారు పవన్ కళ్యాణ్. సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అండ్ టీమ్ స్పందించిన తీరు కరెక్ట్ కాదన్నారు. కనీసం అల్లు అర్జున్ కి కుదురనప్పుడు అటు వైపు ఓ మనిషి చనిపోయినప్పుడు అందునా అభిమాని అయినప్పుడు కనీసం పుష్ప 2 టీమ్ అయినా స్పందించి సంతాపం తెలపాల్సింది అన్నారు పవన్ కళ్యాణ్. గోరుతో పోయేదాన్న గొడ్డలి తెచ్చుకున్నారంటూ అల్లు అర్జున్ పై అతని టీమ్ పై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. సీఎం రేవంత్ రెడ్డి పరిశ్రమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఏపీ డిప్యూటీ సీఎం..పుష్ప 2 బెనిఫిట్ షోలు ఇవ్వటం..టిక్కెట్లు రేట్లు పెంచటం లాంటి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలే అందుకు ఉదాహరణ అన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాకూడదన్న పవన్ కళ్యాణ్...ఇరు రాష్ట్రాల్లో పరిశ్రమను ప్రోత్సహించటమే లక్ష్యంగా రెండు ప్రభుత్వాలు పని చేస్తున్నాయన్నారు పవన్ కళ్యాణ్.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram