Deputy CM Pawan Kalyan in Vaarahi Deeksha | 11రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్షలో పవన్ కళ్యాణ్ | ABP

  ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు. 11రోజులు పాటు పవన్ కళ్యాణ్ ఈ దీక్షలో ఉండనున్నట్లు జనసేన పార్టీ కార్యాలయం వెల్లడించింది.  దీక్షలో భాగంగా వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్న పవన్ కేవలం పండ్లు, పాలు వంటి ద్రవరూప ఆహారాన్నే తీసుకుంటారు. గతేడాది జూన్ లోనూ ఇదేవిధంగా పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను చేపట్టారు. ఈ రోజు అమ్మవారి మాలలోనే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎమ్మెల్యేల అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు. శాసనసభ వ్యవహారాలపై జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమం ద్వారా ఓ అవగాహననకు రానున్నారు. కూటమి ప్రభుత్వం లో మిత్రపక్షంగా జనసేన అవలంబించాల్సిన వ్యూహాలపైనా ఈ సమావేశంలో పవన్ తన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు.  ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు. 11రోజులు పాటు పవన్ కళ్యాణ్ ఈ దీక్షలో ఉండనున్నట్లు జనసేన పార్టీ కార్యాలయం వెల్లడించింది.  దీక్షలో భాగంగా వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్న పవన్ కేవలం పండ్లు, పాలు వంటి ద్రవరూప ఆహారాన్నే తీసుకుంటారు. గతేడాది జూన్ లోనూ ఇదేవిధంగా పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను చేపట్టారు. ఈ రోజు అమ్మవారి మాలలోనే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎమ్మెల్యేల అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు. శాసనసభ వ్యవహారాలపై జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమం ద్వారా ఓ అవగాహననకు రానున్నారు. కూటమి ప్రభుత్వం లో మిత్రపక్షంగా జనసేన అవలంబించాల్సిన వ్యూహాలపైనా ఈ సమావేశంలో పవన్ తన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola