CPI Narayana About EVM Machines|EVMలు వద్దు... బ్యాలెట్ బాక్సులే ముద్దు
ప్రపంచవ్యాప్తంగా 122 దేశాల్లో ఈవీఎమ్ సిస్టమ్ లు లేవని... మరి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎందుకీ రచ్చ అంటూ సీపీఐ నారాయణ అన్నారు. అందరు అనుమానిస్తున్నట్లుగా ఈవీఎమ్ ల ద్వారా అవాస్తవ ఫలితాలు వచ్చే అవకాశం ఉందని... ఎన్నికలు బ్యాలెట్ బాక్సుల ద్వారానే జరపాలని ఆయన డిమాండ్ చేశారు..!
అయితే జగన్ చేసిన ట్వీట్‌పై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించినప్పుడు అంతకు ముందు చంద్రబాబు ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేసినప్పుడు జగన్ స్పీచ్‌లను వైరల్ చేస్తున్నారు. అప్పట్లో ఈవీఎంలను మ్యానుపులేట్ చేయవచ్చన్న చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు జగన్. అసలు ఈవీఎంలలో ట్యాంపరింగ్‌కు అవకాశం ఉండదని ఉదాహరణతో వివరించారు. ఎవరికి ఓటు వేస్తున్నామో వీవీ ప్యాట్‌లో కనిపిస్తుందని అన్నారు. ఒక వ్యక్తిత తనకు నచ్చిన పార్టీకి ఓటు వేస్తే వీవీప్యాట్ స్లిప్‌లో వేరే పార్టీ గుర్తు కనిపిస్తే కచ్చితంగా ఆ వ్యక్తి ప్రశ్నిస్తారని అన్నారు. అలా ఇప్పటి వరకు ఒక్కరంటే ఒక్కరు ప్రశ్నించలేదని గుర్తు చేశారు. అప్పట్లో చేసిన ఈ కామెంట్స్‌ను జగన్‌కు గుర్తు చేస్తున్నారు నెటిజన్లు.