Contract Outsourcing Employees JAC : పర్మినెంట్ చేస్తామని సీఎం హామీ ఇచ్చి..ఇప్పుడు ఇదేంటీ..?
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలు కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నిరాశ మిగిల్చిందని రాష్ట్ర జేఏసీ ఛైర్మన్ ఏవి.నాగేశ్వరరావు ఆరోపించారు. తిరుపతిలోని ఎంబీ భవన్ లో సమావేశమైన ఉద్యోగులు... పీఆర్సీ డీఏ, హెచ్ఆర్ఏ, సీసీఏతో కూడిన బేసిక్ "పే"ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర జేఏసీ ఛైర్మన్ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవోలను రద్దు చేసి తిరిగి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు,అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేసి సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీకి భిన్నంగా జగన్ వ్యవహరించడం మంచిది కాదన్నారు.